సెట్స్ పైన ఉండగానే 47 కోట్లు…సామి శిఖరం!!

Ram charan and Boyapati combination sets new record before shoot

సెట్స్ పైన ఉండగానే 47 కోట్లు…సామి శిఖరం!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఊపు లో ఉన్నాడు. ఎవ్వరి ఊహకలకి అందని విధంగా రంగస్థలం సినిమా చరిత్రను తిరగరాసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకేక్కే సినిమా పై హైప్ కూడా అల్టిమేట్ లెవల్ లో ఉంది…దానికి కారణం కాంబో పై ఉన్న హైప్ అని చెప్పొచ్చు.

బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ తో మాస్ లో అల్టిమేట్ క్రేజ్ ఉన్న హీరో చేస్తున్న సినిమా అవ్వడంతో ఈ సినిమాపై అల్టిమేట్ బజ్ నెలకొనగా ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే ఏకంగా 47 కోట్ల బిజినెస్ ని చేసింది అనేది ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తున్న వార్తా.

తెలుగు హిందీ శాటిలైట్ రైట్స్ రూపంలో ఈ సినిమాకి ఏకంగా 47 కోట్ల ఆఫర్ వచ్చిందట. అందులో తెలుగుకి 20 కోట్లు, హిందీ శాటిలైట్ రైట్స్ కింద 27 కోట్లు దక్కింది అంటున్నారు. ఈ రేంజ్ సెన్సేషనల్ ఆఫర్ దక్కించుకున్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.