నెట్ లో హల్ చల్ చేస్తున్న ‘నా పేరు సూర్య ‘ 20 నిముషాల మూవీ…షాక్ లో అల్లు అర్జున్ ఇది వాళ్ళ పనేనా.?

నెట్ లో హల్ చల్ చేస్తున్న ‘నా పేరు సూర్య ‘ 20 నిముషాల మూవీ…షాక్ లో అల్లు అర్జున్ ఇది వాళ్ళ పనేనా.?

allu arjun

టాలీవుడ్ ను పైరసీ భూతం వెంటాడుతూనే వుంది.అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా అటు ఇంటర్నెట్ లోనూ ఇటు మార్కెట్ లోనూ లీక్ అయి మరోసారి దుమారం రేపుతోంది.ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమా 20 నిముషాలు లీక్ అయ్యింది. ఈ సినిమా లీక్ వ్యవహారం చిత్రయూనిట్ తో పాటు యావ‌త్ తెలుగు చిత్ర ప‌రిశ్రమ షాక్‌కు గురిచేసింది. ఈ సినిమాని మే 4 న విడుద‌ల చేద్దామ‌నుకొంటున్నారు.

అంతలోపే ఈ సినిమా అటు ఇంటర్నెట్ లోనూ ఇటు మార్కెట్ లోనూ లీక్ అయింది. అసలు ఈ సినిమా పైరసీ డిస్క్‌లు ఎక్కడి నుంచి లీకయ్యాయనే ప్రశ్న తలెత్తుతోంది. సెన్సార్ సమయంలోనే లీక్ అయ్యుంటుందా అని కొందరంటోంటే.. ల్యాబ్ నుంచి లీక్ అయ్యుండొచ్చునని ఇంకొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ మద్య మీడియా చానెల్స్ కు అలాగే సినిమా వాళ్ళకు అస్సలు పడడం లేదు.మొన్న జరిగిన నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్ రోజు కూడా ఈ సినిమా నిర్మాతలకు అలాగే కొన్ని మీడియా చానెల్స్ వాళ్లకు మద్య గొడవ జరిగింది.

ఆ రోజు మీడియా చానెల్స్ కూడా మీ సినిమా మీ సినిమా ఎలా హిట్ అవుతుందో మేము చూస్తాం.మీ సినిమాకు నెగెటివ్ పబ్లిసిటీ ఇస్తాం అని అన్నారు.కాబట్టి ఇది మీడియా పనే అయి ఉంటుంది అని ఈ సినిమా నిర్మాతలు అనుకుంటున్నారు.భారీ అంచనాల నడుమ, బృందమంతా అహర్నిశలు శ్రమించి ఒక సినిమాను తెరకెక్కిస్తే ఆ చిత్రం రిలీజ్ లోపే పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చేస్తే ఆ సినిమా బృందం పడ్డ కష్టం ఏమైపోవాలి? నిర్మాతలనే కాదు యావత్ ఇండస్ర్టీని ఆందోళనకు గురి చేస్తున్న ప్రశ్న.

సినిమా విడుదలైన తర్వాత ఎక్కడో ఒక్క చోట ఫైరసీ జరగటం కామన్. అయితే సినిమా విడుదలకు ముందే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగానే లీక్ అవుతున్నాయి. అసలు ల్యాబ్ ల్లో సినిమాలకు సెక్యూరిటీ లేదని నిర్మాతలు వాపోతున్నారు. మొత్తానికి కోట్లు ఖర్చుపెట్టిన సినిమా ఇలా లీక్ అవ్వడం తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదంటున్నారు.దీని వెనకాల ఎవరు ఉన్నా వదిలిపెట్టమని అంటున్నారు.